ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనడం అవివేకం: దత్తాత్రేయ | Bandaru Dattatreya comments | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనడం అవివేకం: దత్తాత్రేయ

Sep 17 2016 2:39 AM | Updated on Sep 4 2017 1:45 PM

ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనడం అవివేకం: దత్తాత్రేయ

ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనడం అవివేకం: దత్తాత్రేయ

సెప్టెంబర్ 17ను విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరితే మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించడం అవివేకమని

సాక్షి, న్యూఢిల్లీ: సెప్టెంబర్ 17ను విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరితే మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించడం అవివేకమని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో వర్కర్స్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.

మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు విమోచన దినాన్ని నిర్వహిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి, ఓట్ల కోసం  సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement