జార్ఖండ్‌లో ఐదుగురు మావోల ఎన్‌కౌంటర్‌ | 5 Maoists killed in encounter with security forces in Jharkhand's Latehar | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో ఐదుగురు మావోల ఎన్‌కౌంటర్‌

Apr 5 2018 3:15 AM | Updated on Jun 4 2019 6:31 PM

5 Maoists killed in encounter with security forces in Jharkhand's Latehar - Sakshi

లతేహార్‌: జార్ఖండ్‌లోని లతేహార్‌ జిల్లాలో బుధవారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. హేరంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భద్గావ్, కేడు గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమావేశం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు బుధవారం ఉదయం ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని హెచ్చరించగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఇద్దరిని మావోయిస్టు సబ్‌ జోనల్‌ కమాండర్లు శివలాల్‌ యాదవ్, శ్రవణ్‌ యాదవ్‌లుగా గుర్తించారు. వీరి తలలపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement