రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు | 4987 New Corona Positive Cases In India | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు

May 17 2020 9:39 AM | Updated on May 17 2020 9:50 AM

4987 New Corona Positive Cases In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4987 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో  పాటు 124 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వైరస్‌ వెలుగుచూసిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో కేసుల నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 90, 927కి చేరుకుంది. ఇక వైరస్‌ సోకి 2872 మంది మృత్యువాతపడ్డారు. వైరస్‌ నుంచి ఇప్పటి వరకు 38,108 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 58,946 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మూడో విడత లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన తరువాత కరోనా వ్యాప్తి మరింత పెరిగినట్లు తెలుస్తోంది. (3.12 లక్షలకు చేరిన కరోనా మృతుల సంఖ్య)

పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు..

  • మహారాష్ట్రలో 30,706 పాజిటివ్‌ కేసులు, 1,135 మంది మృతి
  • గుజరాత్‌లో 10,989 పాజిటివ్‌ కేసులు, 625 మంది మృతి
  • తమిళనాడులో 10,585 పాజిటివ్‌ కేసులు, 74 మంది మృతి
  • ఢిల్లీలో 9,333 పాజిటివ్‌ కేసులు, 129 మంది మృతి
  • రాజస్థాన్‌లో 4,960 పాజిటివ్‌ కేసులు, 126 మంది మృతి
  • మధ్యప్రదేశ్‌లో 4,790 పాజిటివ్‌ కేసులు, 243 మంది మృతి
  • ఉత్తరప్రదేశ్‌లో 4,258 పాజిటివ్‌ కేసులు, 104 మంది మృతి
  • వెస్ట్‌బెంగాల్‌లో 2,576 పాజిటివ్‌ కేసులు, 232 మంది మృతి
  • పంజాబ్‌లో 1,946 పాజిటివ్‌ కేసులు, 32 మంది మృతి
  • బిహార్‌లో 1,178 పాజిటివ్‌ కేసులు, ఏడుగురు మృతి
  • జమ్మూకశ్మీర్‌లో 1,121 పాజిటివ్‌ కేసులు, 12 మంది మృతి
  • కర్ణాటకలో 1,092 పాజిటివ్‌ కేసులు, 36 మంది మృతి

Advertisement
 
Advertisement
Advertisement