వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో 15 మంది మృతి | 15 killed in road crash in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో 15 మంది మృతి

Jan 2 2016 1:47 PM | Updated on Aug 30 2018 3:56 PM

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మృత్యువాత పడ్డారు.

లక్నో: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. బస్సు, జీపు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతిచెందగా, మరో 10 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలు శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్ లోని ని బలరాంపూర్ జిల్లా నుంచి చైనీస్ టూరిస్టులు ఓ బస్సులో సారనాథ్ వెళ్తున్నారు. సందర్శకులతో వెళ్తోన్న బస్సు వారణాసికి 13 కిలోమీటర్ల దూరంలో పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న జీపును ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తోన్న 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.

ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరో వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, టూరిస్ట్ బస్సులోని ఇతర ప్రయాణికులకు స్పల్పగాయాలయ్యాయి. పొగమంచు కారణంగా జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వేకువజామున పొగమంచు కురుస్తుంది కనుక వాహనాలను అతివేగంగా నడపవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement