ఒక్కరోజులో 14 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు | 14,933 New Positive Corona Cases In India | Sakshi
Sakshi News home page

24 గంటల్లో 14 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు

Jun 23 2020 9:53 AM | Updated on Jun 23 2020 12:07 PM

14,933 New Positive Corona Cases In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్‌ బారినపడి 312 మంది మృతి చెందారు. దేశంలో కరోనా వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,40,215కి చేరింది. మరణాల సంఖ్య 14 వేలు దాటింది. ఇప్పటివరకు 2,48,190 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,78,014 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. (వందలో 14 మందికి పాజిటివ్‌)

Advertisement
 
Advertisement
Advertisement