135 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కోవిడ్‌ | 135 CRPF troopers in Delhi test positive for Covid-19 | Sakshi
Sakshi News home page

135 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కోవిడ్‌

May 3 2020 6:18 AM | Updated on May 3 2020 6:18 AM

135 CRPF troopers in Delhi test positive for Covid-19 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)లో కరోనా వైరస్‌ కలకలం రేపింది. ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు  ట్రూపర్లకు కరోనా సోకింది. మరో 22 మందికి సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉంది. రాజధానిలోని మయూర్‌విహార్‌ ప్రాంతంలో ఉండే ఈ బెటాలియన్‌లో సుమారు వెయ్యి మంది జవాన్లుంటారు. ఈ బెటాలియన్‌కు చెందిన సబ్‌ ఇన్స్‌పెక్టర్‌(55) ఒకరు ఇటీవల కరోనా వైరస్‌ సోకి సప్థర్‌ జంగ్‌ ఆసుపత్రిలో చనిపోయారు. తాజా పరిణామంతో బెటాలియన్‌ కార్యాలయాన్ని మూసివేసి, అందులోని వారందరినీ ఐసొలేషన్‌ సెంటర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement