వేటపాలెంలో ఏం జరిగింది? | Vetapalem Telugu Movie | Sakshi
Sakshi News home page

వేటపాలెంలో ఏం జరిగింది?

Apr 6 2016 10:18 PM | Updated on Sep 3 2017 9:20 PM

వేటపాలెంలో ఏం జరిగింది?

వేటపాలెంలో ఏం జరిగింది?

అమ్మా నాన్నా అనే పిలుపుకు దూరమై, మంచీ చెడుల తేడా తెలియని కొంత మంది పిల్లలు క్రిమినల్స్‌గా మారుతున్నారు.

 అమ్మా నాన్నా అనే పిలుపుకు దూరమై, మంచీ చెడుల తేడా తెలియని కొంత మంది పిల్లలు క్రిమినల్స్‌గా మారుతున్నారు. అలాంటి వాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారనే కథాంశంతో తెరకెక్కిన చిత్ర ం ‘వేటపాలెం’. ప్రశాంత్, లావణ్యా, శిల్ప నాయకా నాయికలుగా నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో డా. ఎ.వి.ఆర్  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా కమర్షియల్ హంగులను జోడించి తెరకెక్కించాం. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: తంగిరాల అపర్ణ.
 

Advertisement
 
Advertisement
Advertisement