వేడుక వాయిదా | sye raa narasimha reddy pre release event postponed | Sakshi
Sakshi News home page

వేడుక వాయిదా

Sep 17 2019 12:23 AM | Updated on Sep 17 2019 12:27 AM

sye raa narasimha reddy pre release event postponed - Sakshi

చిరంజీవి

చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రామ్‌ చరణ్‌ నిర్మాత. అమితాబ్‌ బచ్చన్, నయనతార, తమన్నా, సుదీప్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. అక్టోబర్‌ 2న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ప్రీ–రిలీజ్‌ వేడుకను బుధవారం నిర్వహించాలనుకున్నారు. ఇప్పుడు ఆదివారానికి వాయిదా వేశారు. భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో అటు అభిమానులకు ఇటు వేడుకకు ఇబ్బంది అవుతుందని ఆదివారం నిర్వహించాలని నిశ్చయించుకున్నారని సమాచారం. అయితే  ముందుగా ప్రకటించినట్టే ట్రైలర్‌ను మాత్రం బుధవారం రిలీజ్‌ చేస్తారని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement