సమంత అంధురాలు కాదు..! | Samantha not playing visually impaired character | Sakshi
Sakshi News home page

సమంత అంధురాలు కాదు..!

Apr 12 2017 12:56 PM | Updated on Sep 5 2017 8:36 AM

సమంత అంధురాలు కాదు..!

సమంత అంధురాలు కాదు..!

ధృవ సినిమా సక్సెస్ తరువాత రామ్ చరణ్, మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్

ధృవ సినిమా సక్సెస్ తరువాత రామ్ చరణ్, మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో తొలిసారిగా సమంత రామ్ చరణ్ తో జోడి కడుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత అంధురాలి పాత్రలో కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన యూనిట్ సభ్యులు అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు. జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement