హీరోలు అవమానంగా భావిస్తున్నారు | Sai Pallavi Clarification On Controversy With Heros | Sakshi
Sakshi News home page

హీరోలతో విభేదాలు లేవు!

Jul 27 2018 8:33 AM | Updated on Jul 27 2018 9:06 AM

Sai Pallavi Clarification On Controversy With Heros - Sakshi

ఆయనతోను సాయి పల్లవి ఘర్షణ పడినట్లు సమాచారం వెల్లడైంది.

టీ.నగర్‌: హీరోలతో తనకు ఎటువంటి విభేదాలు లేవని నటి సాయి పల్లవి అంటోంది. ‘ప్రేమం’ మళయాల చిత్రంలో తన అసమాన నటన ద్వారా అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు సాయి పల్లవి. అభిమానుల ఆదరణకు తగిన విధంగా అనేక చిత్రాల అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయినప్పటికీ అన్ని చిత్రాలను ఒప్పుకోవడం లేదు. మణిరత్నం దర్శకత్వంలో ‘కాట్రు వెలియిడై’ చిత్రాన్ని మొదట ఒప్పుకుని, తర్వాత గ్లామర్‌ పాత్రలో నటించనని చెప్పి విరమించుకున్నారు. అంతేకాకుండా కొంత మంది ప్రముఖ హీరోల చిత్రాల్లోను నటించేందుకు నిరాకరించారు. విజయ్‌ దర్శకత్వం వహించిన ‘దియా’ చిత్రం ద్వారా తమిళంలో పరిచయమయ్యారు. ఇందులో హీరోగా నటించిన నాగ శౌర్యతో సాయిపల్లవికి విభేదాలు ఏర్పడ్డాయి.

దీని గురించి నాగ శౌర్య బహిరంగంగానే తన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనను సాయి పల్లవి అవమానించినట్లు చెప్పుకున్నారు. అలాగే ‘నాన్‌ ఈ’ చిత్రం హీరో నానితో తెలుగు చిత్రంలో నటిస్తుండగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఎంగేయుం ఎప్పోదుం చిత్రం హీరో శర్వానంద్‌తో ప్రస్తుతం ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నారు సాయిపల్లవి. ఆయనతోను ఘర్షణ పడినట్లు సమాచారం వెల్లడైంది. చిత్రం షూటింగ్‌ సమయాల్లో సన్నివేశం ముగియగానే సాయిపల్లవి ఎవరితోనూ మాట్లాడకుండా తన కారవాన్‌లోనే గడపడం జరుగుతోంది. హీరోలు కుర్చీలలో కూర్చుంటున్నప్పటికీ వారితోపాటు కూర్చోకుండా నివారిస్తున్నారు. దీన్ని కొందరు హీరోలు అవమానంగా భావిస్తున్నారు. సాయిపల్లవి ఈ వైఖరి చర్చనీయాంశంగా మారింది. దీనిగురించి కొందరు విలేకరులు సాయి పల్లవి వద్ద ప్రశ్నించగా షూటింగ్‌ సమయంలో తన పనిని తాను వంద శాతం ప్రత్యేక శ్రద్ధతో చేసి ముగిస్తానని, ఎవరితోను తనకు విభేదాలు లేవని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement