'ఆరంభం'తో కోలీవుడ్కు రానా | Rana Daggubati Enters Into Kollywood in Ajith Kumar's film Aarambam | Sakshi
Sakshi News home page

'ఆరంభం'తో కోలీవుడ్కు రానా

Aug 7 2013 3:51 PM | Updated on Sep 1 2017 9:42 PM

'ఆరంభం'తో కోలీవుడ్కు రానా

'ఆరంభం'తో కోలీవుడ్కు రానా

మరో టాలీవుడ్ హీరో తమిళ చిత్రసీమకు పరిచయం అవుతున్నాడు.

మరో టాలీవుడ్ హీరో తమిళ చిత్రసీమకు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే కొంతమంది తెలుగు యువ హీరోలు కోలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటే.... తాజాగా యువ హీరో రానా కోలీవుడ్లో తెరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్లో సత్తా చాటిన రానా .... అజిత్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆరంభం' చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

శ్రీ సత్యసాయి మూవీస్ పతాకంపై రఘురాం నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్, నయనతారా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో జంటగా ఆర్య, తాప్సీ నటిస్తుండగా.... దగ్గుబాటి రానా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. విష్ణువర్థన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు.  

ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. యువన్ శంకర్ రాజా సంగీత బాణాలు సమకూర్చిన 'ఆరంభం' ఆడియో ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement