breaking news
Aarambam
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ..
థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక అభిమానులుంటారు. అందుకే చాలామంది ఆ జానర్లో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే ఆరంభం. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.సినిమా కథేంటంటే?ఓ గ్రామానికి చెందిన మిగిల్ (మోహన్ భగత్).. హత్య కేసులో రెండున్నరేళ్లుగా శిక్ష అనుభవిస్తుంటాడు. అతడిని ఉరి తీసేందుకు సిద్ధమయ్యే సమయంలో అతడు జైలు నుంచి అదృశ్యమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్లే ఉంటుంది. గోడలు బద్ధకొట్టలేదు, ఊచలు వంచలేదు.. అయినా ఎలా తప్పించుకున్నాడనేది అర్థం కాక జైలు అధికారులు తల పట్టుకుంటారు. ఓ డిటెక్టివ్ సాయం కోరతారు. డిటెక్టివ్ సాయంతో మిగిల్ను పట్టుకున్నారా? అసలు మిగిల్ ఎవరిని హత్య చేసి జైలుకు వచ్చాడు? తర్వాత ఎలా తప్పించుకోగలిగాడు? వంటివి తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!ఎవరెవరు?ఆరంభం చిత్రంలో సుప్రితా సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీతో అజయ్ నాగ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. సిన్జిత్ యర్రంమిల్లి సంగీతం అందించిన ఈ మూవీ మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: తండ్రికి కారు గిఫ్టిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. నీలాంటి కూతురుండాలి! -
'ఆరంభం'తో కోలీవుడ్‌కు రానా
మరో టాలీవుడ్ హీరో తమిళ చిత్రసీమకు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే కొంతమంది తెలుగు యువ హీరోలు కోలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటే.... తాజాగా యువ హీరో రానా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్లో సత్తా చాటిన రానా .... అజిత్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆరంభం' చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ సత్యసాయి మూవీస్ పతాకంపై రఘురాం నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్, నయనతారా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో జంటగా ఆర్య, తాప్సీ నటిస్తుండగా.... దగ్గుబాటి రానా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. విష్ణువర్థన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. యువన్ శంకర్ రాజా సంగీత బాణాలు సమకూర్చిన 'ఆరంభం' ఆడియో ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.