వారసుడు వచ్చాడు : హీరో రామ్‌ | Ram Pothineni Shares His Nephew Sidhanth Pothineni Photo | Sakshi
Sakshi News home page

వారసుడు వచ్చాడు : హీరో రామ్‌

Mar 5 2020 6:42 PM | Updated on Mar 6 2020 2:56 PM

Ram Pothineni Shares His Nephew Sidhanth Pothineni Photo - Sakshi

యంగ్‌ హీరో రామ్‌ పోతినేని సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్‌తోపాటు, సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా విషెస్‌ చెప్పుతూ ఉంటాడు. తాజాగా రామ్‌ ఓ సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. వారసుడు వచ్చాడు అని పేర్కొన్న రామ్‌.. తన నెప్యూ సిద్దాంత్‌ పోతినేనితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. (చదవండి : ఇలాంటి కేస్‌ ఇదే ఫస్ట్‌ టైమ్‌..)

సినిమాల విషయానికి వస్తే.. ఇస్మార్ట్‌ శంకర్‌ విజయంతో మంచి జోష్‌లో ఉన్న హీరో రామ్‌.. ప్రస్తుతం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెడ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ‘రెడ్‌’ షూటింగ్‌ చివరి దశకు చేరకోవడంతో చిత్రం బృందం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంలో రామ్‌ సరసన నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి : ‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’)

Advertisement
 
Advertisement
Advertisement