ఇలాంటి కేస్‌ ఇదే ఫస్ట్‌ టైమ్‌.. | Ram Pothineni RED Movie Teaser Released | Sakshi
Sakshi News home page

ఇలాంటి కేస్‌ ఇదే ఫస్ట్‌ టైమ్‌..

Feb 28 2020 6:30 PM | Updated on Mar 5 2020 6:29 PM

Ram Pothineni RED Movie Teaser Released - Sakshi

రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘రెడ్‌’. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. తాజాగా ‘రెడ్‌’ టీజర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ‘క్రైమ్‌ హిస్టరీలో ఇలాంటి కేసు చూడటం ఇదే ఫస్ట్‌ టైమ్‌’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన చిత్ర టీజర్‌.. చివరివరకు ఇంట్రెస్టింగ్‌ సాగింది. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్‌.. క్లాస్‌, మాస్‌ లుక్స్‌లో అదరగొట్టినట్టుగా టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. ఇస్మార్ట్‌ శంకర్‌తో సత్తా చాటిన రామ్‌.. ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు అంటున్నారు.

ఈ చిత్రంలో రామ్‌ సరసన నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ తర్వాత రామ్‌, కిశోర్‌ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ‘రెడ్‌’పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement