స్పీడు పెంచిన జక్కన్న..! | Ram Charam And Jr NTR And Rajamouli Movie Shooting Update | Sakshi
Sakshi News home page

Jan 21 2019 10:07 AM | Updated on Jul 14 2019 4:05 PM

Ram Charam And Jr NTR And Rajamouli Movie Shooting Update - Sakshi

బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఓ మెగా మల్టీస్టారర్‌ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్ కథానాయకులుగా ఆర్‌ఆర్‌ఆర్‌ (వర్కింగ్ టైటిల్‌) సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో తన రెగ్యులర్‌ స్టైల్‌ను పక్కన పెట్టేశాడట రాజమౌళి. సాధారాణంగా రాజమౌళి సినిమా అంటే ఏడాది పాటు షూటింగ్ జరుపుకుంటుంది. అదే భారీ చిత్రమైతే షూటింగ్ ఎప్పుడూ పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు.

కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో అలా జరగకూడాదని రాజమౌళ షూటింగ్ పక్కగా ప్లాన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు జక్కన్న. అందుకే ఒకే సారి రెండు మూడు స్టూడియోలలో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రధాన సన్నివేశాలు రాజమౌళి తెరకెక్కిస్తుంటే సెకండ్‌ యూనిట్‌ మరో సెట్‌లో ఇతర సన్నివేశాలను షూట్‌ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి జక్కన్న ప్లాన్ ఎంత వరకు వర్క్‌ అవుట్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement