2.ఓ.. ఉత్త సినిమానేనా? | Rajinikanth 2 Point 0 without 3D Version | Sakshi
Sakshi News home page

3డీ వర్షన్‌ లేకుండానే 2.ఓ?

Mar 10 2018 6:33 PM | Updated on Mar 10 2018 6:33 PM

Rajinikanth 2 Point 0 without 3D Version - Sakshi

సాక్షి, సినిమా : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులను ఏ మాత్రం నిరాశపరచకుండా చాలా జాగ్రత్తగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ 2.ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ఈ చిత్రం భారీ బిజినెస్‌ చేస్తోంది. రిలీజ్‌ డేట్‌లో స్పష్టత లేకపోయినా.. భారీ అంచనాలను కొనసాగించేలా మేకింగ్‌ వీడియోలు వదులుతూ శంకర్‌ మతి పొగొడుతున్నాడు. 

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ సమాచారం ఇప్పుడు కోలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌గా మారింది. 2.ఓ 3డీ వర్షన్‌ విడుదల ఉండబోదనేది దాని సారాంశం. నిజానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ మూలంగా చిత్ర విడుదల ఆలస్యమౌతోందన్నది తెలిసిందే. సీజీ వర్క్‌పై శంకర్ అసంతృప్తితో ఉండటమే అందుకు కారణం. పైగా 3డీ ప్రొడక్షన్‌ పనులను అమెరికాకు చెందిన ఓ కంపెనీకి అప్పగించగా.. వారితో శంకర్‌కు బేధాభిప్రాయాలు తలెత్తినట్లు ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి. 

ఈ పరిస్థితులతో 3డీ వర్షన్‌ విడుదల ఆలోచనను నిర్మాతలు విరమించుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే గనుక 2.ఓ లాంటి భారీ బడ్జెట్‌ మూవీని మనం మాములు చిత్రంగానే తెరపై చూస్తామన్న మాట. 

Advertisement
 
Advertisement
Advertisement