రజనీకాంత్‌ బయోపిక్‌ రానుందా? | Rajinikanth Is Writing His Autobiography | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ బయోపిక్‌ రానుందా?

Jul 30 2026 2:30 AM | Updated on Jul 30 2026 2:30 AM

Rajinikanth Is Writing His Autobiography

హీరో రజనీకాంత్‌ జీవితం వెండితెరపైకి వచ్చే అవకాశం  ఉందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. కొంత కాలంగా రజనీకాంత్‌ తన ఆటోబయోగ్రఫీ రాస్తున్నారట. ఇందులో బస్‌ కండక్టర్‌ నుంచి వెండితెరపై సూపర్‌ స్టార్‌గా ఎదిగిన తన జీవిత విశేషాలు, తన జర్నీలోని ఒడిదొడుకులు, మధుర జ్ఞాపకాలు, భావోద్వేగభరిత పరిస్థితులను గురించి ప్రస్తావించనున్నారట రజనీకాంత్‌. అంతేకాదు...తన జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన సంగతులను ఈ పుస్తకం ద్వారా తెలియజేయాలని రజనీకాంత్‌ భావిస్తున్నారట.

ఈ పుస్తకం ఆధారంగా ఓ సినిమా తీయాలని, ఈ బయోపిక్‌ను తెరకెక్కించాల్సి వస్తే ఎవరు దర్శకత్వం వహించాలి? వెండితెరపై తన పాత్రలో ఎవరు నటించాలి? అన్న అంశాలపై కూడా రజనీకాంత్‌ తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారని కోలీవుడ్‌ భోగట్టా. మరి... రజనీకాంత్‌ బయోపిక్‌ వెండితెరపైకి వస్తుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. మరోవైపు ప్రస్తుతం దర్శకుడు అశ్వత్‌ మారిముత్తుతో ‘ధర్మన్‌’ సినిమా చేస్తున్నారు రజనీకాంత్‌.

ఈ చిత్రం తర్వాత నెల్సన్‌ దర్శకత్వం వహించనున్న మల్టీస్టారర్‌ మూవీ షూట్‌లో పాల్గొంటారు. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ కూడా నటిస్తున్నారు. అలాగే నెల్సన్‌ డైరెక్షన్‌లో రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘జైలర్‌ 2’ చిత్రం అక్టోబరు 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement