ఈ సినిమాని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు

Producer Allu Aravind Speech Naa Peru Surya Na Illu India Pre Release - Sakshi

 అల్లు అరవింద్‌

‘‘చిరుత’ ఇంకా రిలీజ్‌ అవ్వలేదు. డాడీ బన్నీని పిలిచి అన్నారు. ‘రేయ్‌ మన ఫ్యామిలీకి డ్యాన్స్‌ వచ్చు అని ఒక పేరు ఉంది. చిన్నప్పటినుంచి నుంచి వీడు ఎక్కడా డ్యాన్స్‌ చేయలేదు. వీడికి డ్యాన్స్‌ చేయడం వచ్చా? లేక మన పరువు తీస్తాడా?’ అని అడిగారు. ‘నువ్వు మర్చిపో మామా. ధైర్యంగా ఉండు. నాకు ప్రైవేట్‌గా తెలుసు’ అని మా నాన్నకు నమ్మకం ఇచ్చాడు బన్నీ. అప్పటి నుంచి డాడీ నన్ను తిట్టడం మానేశారు’’ అన్నారు రామ్‌ చరణ్‌.

అల్లు అర్జున్, అన్యూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘నా పేరు సూర్య  నా ఇల్లు ఇండియా’.  నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మించారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. విశాల్‌శేఖర్‌ పాటలు స్వరపరిచారు. సినిమా మే 4న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ ‘‘సినిమాల్లోకి రాకముందు బర్త్‌డే పార్టీల్లో నేనెక్కువ డ్యాన్స్‌ చేసేవాణ్ణి కాదు. మా డాడీ తిట్టేవారు.

బన్నీ డ్యాన్స్‌ చూసి నేర్చుకోరా అని. బన్నీలో ఒక కసి ఉంటుంది. తను చేసిన గోన గన్నారెడ్డి చిన్న క్యారెక్టర్‌. తక్కువ సమయం అయినా ఎన్ని అవార్డ్స్‌ కొట్టాడో మీరే చూశారు. అదే గోన గన్నారెడ్డి రెండున్నర గంటలు ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. దానికి ఇంకా ఎన్ని అవార్డ్స్, ఎంత మెప్పు పొందుతాడా అని ఎదురు చూస్తున్నాను. లాస్ట్‌ రెండేళ్లుగా క్రిటికల్‌ అప్రిషియేషన్‌ వచ్చిన సినిమాలు సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. నా ‘రంగస్థలం’ కూడా. మన ఇండస్ట్రీ ప్రౌడ్‌ మూమెంట్‌లో ఉంది. దానికి మరో ఎగ్జాంపుల్‌ ‘నా పేరు సూర్య’ అవ్వాలి.

నా ‘ఎవడు’ సినిమాకు రాసిన వంశీ ఈ సినిమా డైరెక్టర్‌. తన రైటింగ్‌ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ సినిమా చూస్తుంటే ఇన్‌స్పైరింగ్‌ కాన్సెప్ట్‌లా ఉంది. నా బ్రదర్‌ బన్నీ చేసిన ఈ ఆర్మీ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. మనకున్న హానెస్ట్‌ దర్శకుల్లో వంశీ ఉండాలని కోరుకుంటున్నాను. మామ (అల్లు అరవింద్‌) ఏదో ఒక కాంట్రవర్శీ లేకుండా మాట్లాడడు. కానీ  ఆయన పెయిన్‌ని నేను అర్థం చేసుకోగలను. అవినీతి లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఫిల్మ్‌ ఇండస్ట్రీయే.

ఇక్కడ అందరం కష్టపడతాం. యాక్టర్స్‌ ఉదయాన్నే లేస్తాం. జిమ్‌కి వెళ్తాం. మేకప్‌ వేసుకొని ఎండల్లో వానల్లో షూటింగ్‌ చేస్తాం. బన్నీకి ఎన్నో దెబ్బలున్నాయి. డ్యాన్స్, ఫైట్స్‌లో దెబ్బలు తగులుతుంటాయి. మహేశ్, తారక్, ప్రభాస్‌... మా అందరికీ దెబ్బలు తగులుతుంటాయి. ప్రభాస్‌కి రెండు సార్లు భుజానికి సర్జరీ అయింది. మా నాన్నగారికి, బాలకృష్ణగారికి కూడా భుజానికి సర్జరీ జరిగింది. ఒళ్లు హూనం చేసుకుంటాం. ఇందులో అవినీతి ఎక్కడైనా కనిపిస్తుందా? మీడియా కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్టుగా  రాస్తోంది.

లాస్ట్‌ రెండు నెలలుగా జరిగిన వాటిని చూసినవాళ్లు ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకుంటారే తప్ప ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు, నమ్మరు. మీరు (మీడియా) మాకు బిగ్గెస్ట్‌ సపోర్ట్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు బ్రతకండి హ్యాపీగా, మమ్మల్ని బ్రతకనివ్వండి హ్యాపీగా’’ అన్నారు. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ  ‘‘ఇండియన్‌ ఆర్మీకి థ్యాంక్స్‌. మీరు లేకపోతే ఈ స్థాయిలో మేము సినిమా తీసేవాళ్లం కాదు. ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చిన నల్లమలుపు బుజ్జిగారికి థ్యాంక్స్‌.

ఒక స్టార్‌ డైరెక్టర్‌కు ఎంత ఖర్చుపెడతారో ఒక దర్శకుడు పరిచయం అవుతున్న ఈ సినిమాకు అంతే ఖర్చుపెట్టారు శ్రీధర్‌గారు. నాకు నచ్చిన వ్యక్తి నాగబాబుగారికి సినిమా చేసే స్థాయిని ప్రేక్షకులు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్‌. ఈ సినిమా సహనిర్మాత ‘బన్నీ’ వాసుకు థ్యాంక్స్‌. రేపు సినిమా సక్సెస్‌ అయితే.. వంద కారణాలు ఉంటే అవన్నీ డైరెక్టర్‌గారే. నేను చేసిందల్లా ఆయన్ను నమ్మడమే. ‘రంగస్థలం’ సినిమాతో ఈ స్థలం నాది అని ప్రూవ్‌ చేశావ్‌ చరణ్‌. అలాగే ‘భరత్‌ అనే నేను’ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.

అలాగే ‘నా పేరు సూర్య...’తో ఈ సమ్మర్‌ ఒక హ్యాట్రిక్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘కథ విన్నప్పటి నుంచి వంశీ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు బన్నీ. ఈ మధ్య ఇండస్ట్రీలో మనసు  కలిచి వేసే సంఘటనలు జరిగాయి. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవల్సి వచ్చింది. ఆ నిర్ణయాల వల్ల కొంతమంది ఈ సినిమాను తప్పుదోవ పట్టించడానికో, క్రిటిసైజ్‌ చేయడానికో  ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని దాటగలిగినవారు మీరే (ప్రేక్షకులు) ఈ స్క్రీన్‌ వెనకాలే కొన్ని సంఘటనలు జరిగాయి.

ఒక స్టాండ్‌ తీసుకోవల్సి వచ్చింది. ఆ స్టాండ్‌ తీసుకోవడానికి  నమ్మకం మీరందరు (ప్రేక్షకులు). సినిమా రషెస్‌ చుశాక అర్థం అయ్యింది. ఈ సినిమాలోని పాత్ర అర్జున్‌నే చేయాలని. నా మేనల్లుడు, నా కొడుకు ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ‘‘శ్రీధర్‌గారితో కలిసి ఈ సినిమా చేయి అని చేయించిన అరవింద్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు నాగబాబు. ‘‘సినిమాల్లోకి వెళ్తా అంటే ఎవ్వరూ ప్రొత్సహించరు. కానీ మా ఇంట్లో ప్రోత్సహించారు. 

ఈరోజు నేనిలా నిలబడటానికి మా అమ్మగారు, నా భార్యే కారణం. పర్సనల్‌గా ఆర్మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటా. బన్నీ ద్వారా వాళ్ల మీద సినిమా తీసే చాన్స్‌ వచ్చింది. ఇంత మంచి సినిమా ఇచ్చిన హీరో అల్లు అర్జున్, డైరెక్టర్‌ వక్కంతం వంశీలకు రుణపడి ఉంటాను. సినిమాకు కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ బన్నీ. కొత్త డైరెక్టర్‌తో 100కోట్లు రిస్క్‌ చేయడం మామూలు విషయం కాదు’’ అన్నారు నిర్మాత శ్రీధర్‌. ‘‘ప్రతి సినిమాకు డబ్బు, పేరు వస్తుంది కానీ ఈ సినిమా ద్వారా గౌరవం కూడా వస్తుంది అనుకుంటున్నాను’’అన్నారు సహనిర్మాత ‘బన్నీ’ వాసు.

‘‘సినిమా డైరెక్టర్‌ ఎప్పుడవుతావురా? అన్న మా అమ్మానాన్నలు ఇక్కడ ఉన్నారు. అయ్యానమ్మా. సినిమా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావుగారికి కృతజ్ఙతలు. ఆయన లేరు. ఈ బాధలో కూడా ఆనందం ఏంటంటే.. ఆయన పుట్టినరోజు నాడు ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. మంచి సినిమా తీశాను అన్న తృప్తితోనే ఈ ఫంక్షన్‌లో నిల్చున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top