పాటలతో ప్రశ్నిస్తా | Prasnistha Movie Audio Launch | Sakshi
Sakshi News home page

పాటలతో ప్రశ్నిస్తా

Mar 25 2019 12:14 AM | Updated on Jul 12 2019 4:40 PM

Prasnistha Movie Audio Launch - Sakshi

హసీనా, మనీష్‌ బాబు, అక్షిత

మనీష్‌ బాబు హీరోగా, అక్షిత, హసీనా మస్తాన్‌ మీర్జా హీరోయిన్స్‌గా రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రశ్నిస్తా’. జనం ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మించారు. వెంగి సంగీతం అందించిన ఈ సినిమా పాటల సీడీలను దర్శకుడు కెఎస్‌ రవీంద్ర(బాబీ) విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రారంభం రోజున మనీష్‌ని చూసాను. మంచి హైట్, ఫిజిక్‌తో బాగున్నాడు. ఇప్పుడు టీజర్‌ చూసాక హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి. భవిష్యత్తులో తను పెద్ద హీరోగా ఎదగాలి. ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్స్‌ చిత్రాలు డీల్‌ చేయడం చాలా కష్టం.

కానీ, రాజా వన్నెంరెడ్డిగారు అలాంటి చిత్రాలు తీసి హిట్స్‌ కొట్టారు’’ అన్నారు.‘‘చిన్న సినిమాగా స్టార్ట్‌ చేసిన ఈ చిత్రం కథ డిమాండ్‌ను బట్టి బడ్జెట్‌ ఐదు రెట్లు పెరిగి పెద్ద చిత్రంలా తయారయ్యింది. ఈ సినిమాతో మనీష్‌ 10కోట్ల రేంజ్‌ హీరో అవుతాడు’’ అన్నారు రాజా వన్నెంరెడ్డి. ‘‘కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌గా పొలిటికల్‌ టచ్‌తో రూపొందించిన చిత్రమిది. ట్రయిలర్‌ రిలీజ్‌ చేసిన తర్వాత మా సినిమాకి బిజినెస్‌ క్రేజ్‌ పెరిగింది’’ అని పి. సత్యారెడ్డి అన్నారు. మనీష్, అక్షిత, హసీనా మస్తాన్‌ మీర్జా నిర్మాతలు కోనేరు సత్యనారాయణ, బెక్కం వేణుగోపాల్, రాజీవ్‌ శివారెడ్డి, వరప్రసాద్, విసు, సురేష్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement