వారు వద్దన్నారని.. ‘సైరా’కు ప్యాకప్‌ చెప్పారట! | People Protest Against Sye Raa Shooting In Bidar | Sakshi
Sakshi News home page

వారు వద్దన్నారని.. ‘సైరా’కు ప్యాకప్‌ చెప్పారట!

Feb 25 2019 7:12 PM | Updated on Feb 25 2019 7:12 PM

People Protest Against Sye Raa Shooting In Bidar - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా.. రామ్‌చరణ్‌ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న చిత్రం ‘సైరా’. బాలీవుడ్‌, కోలీవుడ్, శాండల్‌వుడ్‌ ఇలా అన్ని భాషల్లోని టాప్‌ స్టార్స్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన మల్టిస్టారర్‌ మూవీపై అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. విరామం లేకుండా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్‌కు తాజాగా చేదు సంఘటన ఎదురైంది.

ఈ మూవీలో పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు యూనిట్‌ మొత్తం.. బీదర్‌ వెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడికి అన్ని పర్మిషన్లు తీసుకుని వెళ్లారని కానీ.. అక్కడి ప్రజలు మాత్రం షూటింగ్‌ జరపడాన్ని వ్యతిరేకించారని తెలుస్తోంది. తమ ప్రాంతాల్లో కత్తులు, యుద్దాలతో కూడిన సన్నివేశాలు షూట్‌ చేయకూడదని డిమాండ్‌ చేశారని, దీంతో ఏం చేయలేక యూనిట్‌ తిరిగివచ్చిందనే టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ పార్ట్‌కు సంబంధించి షూట్‌చేయడానికి కోకాపేటలోనే మరో సెట్‌వేసినట్లు సమాచారం. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement