ఇప్పుడ‌ప్పుడే షూటింగ్‌కు వెళ్ల‌ను | Nithya Menon Says Her Schedule In Lockdown Period | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్ స‌మ‌యాన్ని వాడేసుకున్నా

Jun 22 2020 2:54 PM | Updated on Jun 22 2020 4:12 PM

Nithya Menon Says Her Schedule In Lockdown Period - Sakshi

లాక్‌డౌన్ వ‌ల్ల సినిమాలు ప‌క్క‌న‌పెట్టి కాస్త ప్ర‌శాంతంగా గ‌డిపిన సెల‌బ్రిటీలు ఇప్పుడు మ‌ళ్లీ మేక‌ప్ వేసుకునే స‌మ‌యం వ‌చ్చేసింది. ఇప్ప‌టికే సీరియ‌ల్స్ షూటింగ్‌లు ప్రారంభ‌మ‌గా సినిమా వాళ్లు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్‌.. కెమెరా.. యాక్ష‌న్ అంటూ సెట్స్‌లో అడుగుపెడుతున్నారు. అయితే తన‌కు ఇప్పుడప్పుడే షూటింగ్‌లో పాల్గొనే ఆలోచ‌న‌‌ లేదంటోంది మలయాళ బ్యూటీ నిత్యామీన‌న్‌. సెట్స్‌లో భౌతిక‌దూరం పాటించ‌డం దాదాపు అసాధ్య‌మ‌ని, ప్ర‌స్తుత కోవిడ్‌ ప‌రిస్థితిని ప‌రిశీలించిన త‌ర్వాతే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని స్ప‌ష్టం చేసింది. అయినా దీనికంత తొంద‌రేం లేద‌ని తెలిపింది. మ‌రోవైపు ఈ లాక్‌డౌన్ కాలాన్ని విప‌రీతంగా వాడేసుకున్నానంటోంది‌. బెంగ‌ళూరులో కుటుంబంతో క‌లిసి నివ‌సించేందుకు అవ‌కాశం ల‌భించింద‌ని సంతోషం వ్య‌క్తం చేసింది. (ధనుష్‌తో మొదటిసారి... నిత్య )

ఈ స‌మ‌యంలో రాయ‌డం, చ‌ద‌వ‌డం మ‌ళ్లీ మొద‌లెట్టాన‌ని, ప‌నిలో ప‌నిగా ఆరోగ్యంపై కూడా శ్ర‌ద్ధ పెట్టిన‌ట్లు తెలిపింది. ముఖ్యంగా వీధుల‌న్నీ నిర్మానుష్యంగా, నిశ్శ‌బ్ధంగా ఉండ‌టం ఎంతో ప్ర‌శాంత‌త‌నిచ్చింద‌ని పేర్కొంది. కాగా నిత్య చేతిలో నాలుగైదు ప్రాజెక్టులుండ‌గా అటు వెబ్ సిరీస్‌కూ ప‌చ్చ‌జెండా ఊపేసింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానున్న "బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్" చిత్రంతో వెబ్ సిరీస్‌లో తెరంగ్రేటం చేయ‌నుంది. ఇందులో అభిషేక్ బ‌చ్చ‌న్‌, అమిత్ సాధ్‌, సైయామీ ఖేర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆమె చివ‌రిసారిగా 'సైకో' చిత్రంలో కనిపించింది. (తను నీడలో ఉంది)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement