బర్త్‌డే స్పెషల్‌ | Nishabdam teaser released on november 7 | Sakshi
Sakshi News home page

బర్త్‌డే స్పెషల్‌

Oct 22 2019 2:21 AM | Updated on Oct 22 2019 2:21 AM

Nishabdam teaser released on november 7 - Sakshi

నిశ్శబ్ధంగా అమెరికాలో చిత్రీకరణ పూర్తి చేశారు ‘నిశ్శబ్ధం’ చిత్రబృందం. ఆల్రెడీ సినిమాలో అనుష్క, మాధవన్‌ లుక్స్‌ను విడుదల చేశారు. ఇప్పుడు టీజర్‌ రెడీ అని తెలిసింది. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్ధం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను నవంబర్‌ 7న విడుదల చేయనున్నట్టు సమాచారం. నవంబర్‌ 7 అనుష్క బర్త్‌డే. ఆమె బర్త్‌డే స్పెషల్‌గా ఈ టీజర్‌ను విడుదల చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం అమెరికా, ఇండియాలో ఏకకాలంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఫుల్‌ స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement