సైగలే మాటలు | nishabdam movie poster release | Sakshi
Sakshi News home page

సైగలే మాటలు

Jul 21 2019 5:58 AM | Updated on Jul 21 2019 5:58 AM

nishabdam movie poster release - Sakshi

టైటిల్‌ లోగో, అనుష్క

మాటల్లేవ్‌. ఓన్లీ సైగలే అంటున్నారు అనుష్క. అందుకే చేతులతో సైగలు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడున్న ఫొటోలో చేతులు చూశారు కదా. ఇది అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్ధం’ టైటిల్‌ పోస్టర్‌ లుక్‌. అనుష్క ఇండస్ట్రీలోకి వచ్చి పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అనుష్క బదిర యువతి (చెవిటి మూగ) పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. మరో హీరోయిన్‌ అంజలి పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో ఆర్‌. మాధవన్, మైఖేల్‌ మ్యాడసన్, షాలినీ పాండే ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ–నిర్మాత. ప్రస్తుతం అమెరికాలోని సియాటిల్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. చిత్రీకరణ దాదాపు ముగిసిందని తెలిసింది. యునైటెడ్‌ స్టేట్స్‌లోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీనివాస్‌ అవసరాల, హంటర్‌ ఓ హరో మెయిన్, సుబ్బరాజు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement