సరికొత్త కాంబినేషన్లు | New Combinations in Tollywood | Sakshi
Sakshi News home page

సరికొత్త కాంబినేషన్లు

Oct 19 2013 12:17 AM | Updated on Sep 1 2017 11:45 PM

సరికొత్త కాంబినేషన్లు

సరికొత్త కాంబినేషన్లు

సినిమా పరిశ్రమలో ఎవరెవరు ఎప్పుడు కలిసి పనిచేస్తారనేది ఎవ్వరూ చెప్పలేరు. ఫలానావారు ఫలానా వారికే సెట్ అవుతారనే రూల్ కూడా ఏమీ లేదు.

సినిమా పరిశ్రమలో ఎవరెవరు ఎప్పుడు కలిసి పనిచేస్తారనేది ఎవ్వరూ చెప్పలేరు. ఫలానావారు ఫలానా వారికే సెట్ అవుతారనే రూల్ కూడా ఏమీ లేదు. ఇక్కడ ఏదైనా జరగొచ్చును. ఒక్కోసారి కొన్ని కాంబినేషన్లు భలే గమ్మత్తుగానూ ఆసక్తికరంగానూ అనిపిస్తాయి. అలాంటి ఓ నాలుగు కాంబినేషన్ల గురించి ప్రస్తుతం ఫిలిమ్‌నగర్‌లో వేడి వేడి చర్చ జరుగుతోంది.
 
తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌కి మళ్లీ ఓ కొత్త ఉత్తేజం తీసుకొచ్చారు వెంకటేశ్. మహేశ్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేసిన వెంకీ, ‘మసాలా’లో రామ్‌తో కలిసి యాక్ట్ చేస్తున్నారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు ఫిలిమ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో పాటు మరో వార్త షికారు చేస్తోంది. ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ చిత్రాలతో తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్న మారుతి దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయడానికి అంగీకరించారట. దీనికి టైటిల్ ‘రాధ’ అని సమాచారం. డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారట.
 
 ఎన్టీఆర్‌లాంటి హై ఓల్టేజ్ మాస్ హీరో, త్రివిక్రమ్ శైలిలో సినిమా చేస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఉద్వేగాన్ని రేకెత్తించే వార్తే. ఇటీవలే ‘అత్తారింటికి దారేది’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ నెక్స్ ్ట ఎన్టీఆర్‌తో కలిసి పని చేయబోతున్నారట. ఇందుకు సంబంధించి సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘రభస’ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉందట. 
 
 రామ్‌చరణ్ అంటేనే విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇటు దశరథ్ చూస్తే పక్కా క్లాస్ డెరైక్టర్. మరి వీరిద్దరి కలయికలో సినిమా అంటే సమ్‌థింగ్ డిఫరెంట్ అనుకోవాలి. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండిస్తాడనే పేరున్న దశరథ్ చెప్పిన కథ చరణ్‌కి బాగా నచ్చిందట. ఏవో కొన్ని మార్పులు సూచించారని సమాచారం. అన్నీ సెట్ అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ పట్టాలెక్కేస్తుందన్నమాట.
 
 పూరి జగన్నాథ్ సినిమాలో హీరో కేరెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే హీరోలందరూ పూరితో కలిసి పనిచేయడానికి అమితాసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం నితిన్‌తో ‘హార్ట్ ఎటాక్’ చేస్తున్న పూరి, ఆ తర్వాత విష్ణుతో సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని పూరి కూడా ధ్రువీకరించారు. అయితే ఇది ‘అసెంబ్లీ రౌడీ’కి సీక్వెల్ అని బయట ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement