సాహోకు బై బై | Neil Nitin Mukesh wraps up shooting for Saaho | Sakshi
Sakshi News home page

సాహోకు బై బై

Jun 17 2019 2:48 AM | Updated on Jul 17 2019 10:14 AM

Neil Nitin Mukesh wraps up shooting for Saaho - Sakshi

ప్రభాస్, నీల్‌ నితిన్, శ్రద్ధ

రెండేళ్ల ‘సాహో’ ప్రయాణం పూర్తి కావస్తోంది. ఒక్కొక్కరుగా టీమ్‌కు బై బై చెబుతున్నారు. తాజాగా ‘సాహో’ చిత్రంలో విలన్‌గా నటించిన బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ తన వంతు షూటింగ్‌ పూర్తి చేశారు. సుజిత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. 300 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అరుణ్‌ విజయ్, మురళీశర్మ, లాల్‌ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

ఇటీవల రిలీజ్‌ చేసిన ‘సాహో’ టీజర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోందని టీమ్‌ పేర్కొంది. ‘సాహో’ టీమ్‌కు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ వీడ్కోలు పలుకుతూ– ‘‘రెండేళ్లయింది ఈ అద్భుతమైన ప్రయాణం మొదలై. ఈ టీమ్‌తో వర్క్‌ చేయడం చాలా గర్వంగా ఉంది. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాధ్యతలను సంగీత దర్శకుడు జిబ్రాన్‌ తీసుకుంటున్నారని చిత్రబృందం తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: మది.
 

Advertisement
 
Advertisement
Advertisement