వయొలెన్స్‌ కావాలన్నారుగా.. : నాని | Nani New Movie V Release Date Fixed | Sakshi
Sakshi News home page

వయొలెన్స్‌ కావాలన్నారుగా.. : నాని

Nov 4 2019 10:50 AM | Updated on Nov 4 2019 11:18 AM

Nani New Movie V Release Date Fixed - Sakshi

వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను సాధించి తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు హీరో నాని. తాజాగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నాని ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది నాని 25వ చిత్రం. నాని ఎక్కువగా యాక్షన్‌ సీన్స్‌ ఉండే సినిమాలు చేయడని.. కొందరు ఆయనపై విమర్శలు కూడా చేస్తుంటారు. అలాంటి వారి కోసమే నాని చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటుంది.

వయొలెన్స్‌ కావాలన్నారుగా, ఇస్తా ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా అని నాని ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా గన్స్‌తో కూడిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌పై ‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అని విలియం షేక్‌స్పియర్ కోట్స్‌ను ఉంచారు. వచ్చే ఏడాది ఉగాది కానుగా మార్చి 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్టు సమాచారం. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. మరో హీరో సుధీర్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అదితిరావు హైదరీ, నివేదా థామస్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement