ఎమోషనల్‌ జర్నీ స్టార్ట్‌ | Nandamuri Kalyanram and Mehreen New Movie Launch | Sakshi
Sakshi News home page

ఎమోషనల్‌ జర్నీ స్టార్ట్‌

Jun 21 2019 12:49 AM | Updated on Jun 21 2019 12:49 AM

Nandamuri Kalyanram and Mehreen New Movie Launch - Sakshi

సతీశ్‌ వేగేశ్న, మెహరీన్, కల్యాణ్‌ రామ్, కృష్ణప్రసాద్, ఉమేశ్‌ గుప్తా

ఆదిత్య మ్యూజిక్‌ కంపెనీ నిర్మాణంలోకి అడుగుపెడుతూ తీయనున్న మొదటి చిత్రం ముహూర్తం గురువారం జరిగింది. కల్యాణ్‌ రామ్, మెహరీన్‌ జంటగా  దర్శకుడు సతీశ్‌ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేశ్‌ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తానికి ‘దిల్‌’రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముహూర్త సన్నివేశానికి సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ క్లాప్‌ ఇవ్వగా, జగదీశ్‌ గుప్తా కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఉమేశ్‌ గుప్తా గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘జూలై 24న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. హైదరాబాద్, రాజమండ్రి, ఊటీ ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తాం. సతీశ్‌ వేగేశ్నగారు అద్భుతమైన ఎమోషన్స్‌తో ఈ కథను సిద్ధం చేశారు’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ తోట, సంగీతం: గోపీ సుందర్, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: రషీద్‌ ఖాన్‌.

Advertisement
 
Advertisement
Advertisement