బాబూ... నీ లుక్కు మైండ్‌ బ్లాకు | mind block song launch on sarileru neekevvaru movie | Sakshi
Sakshi News home page

బాబూ... నీ లుక్కు మైండ్‌ బ్లాకు

Dec 3 2019 12:35 AM | Updated on Dec 3 2019 12:35 AM

mind block song launch on sarileru neekevvaru movie - Sakshi

మహేశ్‌బాబు

‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాకైపొద్దో ఆడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’ (2006) సినిమాలో మహేశ్‌బాబు పలికిన మైండ్‌ బ్లాక్‌ డైలాగ్‌ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడు డైలాగ్‌. ఇప్పుడు ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌ వచ్చింది. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు.

ఈ సినిమా కోసం శ్రీమణి రాసిన ‘మైండ్‌ బ్లాక్‌.. మైండ్‌ బ్లాక్‌.. మైండ్‌ బ్లాక్‌.. బాబూ... నీ మాస్‌ లుక్కు మైండ్‌ బ్లాకు’ అనే పాటను సోమవారం విడుదల చేశారు. బ్లేజ్, రెనినా రెడ్డి పాడారు. ఈ పాటలో మహేశ్‌ ‘నువ్వు కొట్టరా.., నువ్వు ఉండరా, నువ్వు దంచెహె’ అని కొన్ని డైలాగులు చెప్పడం స్పెషల్‌ ఎట్రాక్షన్‌. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు స్వరకర్త. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం  జనవరి 11న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement