ఇదే.. నాకు సంతోషాన్నిచ్చేది: మిహీకా బజాజ్‌ | Miheeka Bajaj Shares Photos With Rana Daggubati With Adorable Caption | Sakshi
Sakshi News home page

ఇది ఆరంభం​.. ఇక ఎప్పటికీ: మిహీకా

May 22 2020 12:24 PM | Updated on May 22 2020 1:50 PM

Miheeka Bajaj Shares Photos With Rana Daggubati With Adorable Caption - Sakshi

టాలీవుడ్‌ హీరో‌ రానా దగ్గుబాటి కాబోయే భార్య మిహీకా బజాజ్‌ల రోకా కార్యక్రమం ఫొటోలు ప్రస్తుతం నెట్టింటా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో రానాతో‌  సన్నిహ​తంగా ఉన్న పలు ఫొటోలను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం షేర్‌ చేశారు. ఇందులో రానా తన చెవిలో గుసగుసలాడుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఇదే నాకు సంతోషాన్నిచ్చేది’ అంటూ 3 హార్ట్‌ ఎమోజీలతో నవ్వుతూ ఉండే రెండు ఎమోజీలను జత చేసి షేర్‌ చేశారు. ఇక మిహీకా పోస్టుకు హీరో వెంకటేష్‌ కూతురు అశ్రిత దగ్గుబాటి ‘‘పట్టలేనంత సంతోషంగా ఉంది. నేను అక్కడ లేనన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, మీ ఇద్దరికి నా పెద్ద హగ్‌’’ అంటూ కామెంట్‌ చేశారు. అంతేగాక బాలీవుడ్‌ బామ సోనమ్‌ కపూర్‌ భర్త అనంద్‌ అహుజీ కూడా మిహీక-రానాలకు శుభకాంక్షలు తెలిపాడు. (నిశ్చితార్థంపై క్లారిటీ ఇచ్చిన రానా)

చదవండి: నా భర్త ఎక్కడో గొయ్యి తవ్వుతున్నాడు : సమంత

My happy place! 🥰🥰 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

రానాతో ఉన్న మరో ఫొటోను షేర్‌ చేస్తూ, ‘ఇది ఆరంభం...ఇక ఎప్పటికీ’ అనే క్యాప్షన్‌కు హార్ట్‌ ఎమోజీలను జత చేయగా, గతవారం మిహీకా తన ప్రేమను అంగికరించిందని ఇప్పుడు తామిద్దరం రిలేషన్‌షిప్‌‌లో ఉన్నామంటూ రానా తన ప్రేమను సోషల్‌ మీడియాలో అధికారింగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్‌ సిగ్నిల్‌ ఇవ్వడంతో మంగళవారం వీరిద్దరి నిశ్చితార్థం, వివాహా వేడులకు ముహుర్తం ఖారారు చేసేందుకు బుధవారం రామనాయుడు స్టూడియోలో రోకా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో వీరిద్దరికి బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమల ప్రముఖుల నుంచి సోషల్‌ మీడియాలో శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. (నిశ్చితార్థం కాదు.. రోకా)

Advertisement
 
Advertisement
Advertisement