నా భర్త ఎక్కడో గొయ్యి తవ్వుతున్నాడు : సమంత | Samantha Shares Handsome Pic Of Naga Chaitanya | Sakshi
Sakshi News home page

నా భర్త ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో కదా??

May 22 2020 10:37 AM | Updated on May 22 2020 12:27 PM

Samantha Shares Handsome Pic Of Naga Chaitanya - Sakshi

హైదరాబాద్‌ : ప్రముఖ నటి సమంత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా.. అప్పుడప్పుడూ తన భర్త నాగచైతన్యను ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు కూడా చేస్తారు. ఇటీవల జరిగిన హీరో రానా రోకా ఫంక్షన్‌లో నాగచైతన్య, సమంత దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. (చదవండి : నిశ్చితార్థం కాదు.. రోకా)

తొలుత రానా-మిహీకా దంపతులతో దగ్గుబాటి యంగర్‌ జనరేషన్‌ కలిసి దిగిన ఫొటోను సమంత షేర్‌ చేశారు. 2020లో ఒక మంచి వార్త చెప్పినందుకు రానా, మిహీకాలకు థ్యాంక్స్‌ చెప్పారు. అనంతరం నాగచైతన్య ఫొటో షేర్‌ చేసిన సమంత.. ఆయనను ఆటపట్టించేలా ఫన్నీ పోస్ట్‌ చేశారు. ‘అమ్మ, అంటీ, బంధువులు, స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ సమయం వచ్చింది. చూడండి నా భర్త ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో కదా??(భర్త ఎక్కడో ఒక్క పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు)’ అని పేర్కొన్నారు. దీనిపై అంతే సరదాగా స్పందించిన నాగచైతన్య.. చూస్తుంటే ఇది ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్‌ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement