నిశ్చితార్థంపై క్లారిటీ ఇచ్చిన రానా | Rana Given Clarity On His Engagement says Its Roka Function | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థంపై క్లారిటీ ఇచ్చిన రానా

May 21 2020 6:19 PM | Updated on May 21 2020 6:49 PM

Rana Given Clarity On His Engagement says Its Roka Function - Sakshi

రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ ఈ ఇద్దరి పేర్లు ఇప్పుడు టీ-టౌన్‌లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా రానా, మిహీకా ప్రేమ వ్యవహారం, ఇప్పుడేమో వీరి నిశ్చితార్థం జరిగిపోయిందన్న వార్తలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా రామానాయుడు స్టూడియోలో మిహీకాతో దిగిన ఫోటోలను రానా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో నిజంగానే భళ్లాలదేవుడు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడా అని అభిమానులతోపాటు సినిమా ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యానికి గురవుతోంది. దీంతో ప్రముఖుల నుంచి వీరిద్దరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాము ఇంకా నిశ్చితార్థం చేసుకోలేదని, కేవలం రోకా ఫంక్షన్‌ ఏర్పాటు చేసుకున్నట్లు రానా స్పష్టం చేశారు. (సంప్రదాయ దుస్తుల్లో రానా-మిహీక: వైరల్‌)

అంతేగాక హీరో నానితో వాట్సాప్‌లో చాట్‌ చేసుకున్న సరదా సంభాషణను స్క్రీన్‌షాట్‌ తీసి రానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో అబ్బాయి ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా అని నాని అడగ్గా.. లేదు రోకా ఫంక్షన్‌ అని రానా బదులిచ్చారు. వెంటనే నాని రోకా ఫంక్షన్‌ అంటే తనకు తెలియదన్నట్టు గూగుల్‌లో సెర్చ్‌ చెస్తా అని ఫన్నీ కామెంట్‌ పెట్టారు. రోకా వేడుక అనేది వధూవరుల కుటుంబాలు ఒకరినొకరు కలుసుకొని నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన విషయాల గురించి చర్చించడం. దీనితోనే ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభం అయినట్లు సంకేతం. దక్షిణాదిలో దీనిని పెద్దగా పట్టించకపోయినా ఉత్తరాదిలో ఎక్కువగా పాటిస్తారు.(ముహూర్తం ఎప్పుడు?)

To the beginning of forever 💕 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

ఇక రోకా ఫంక్షన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీనికి ‘జీవితానికి ఇది ప్రారంభం’ అంటూ హార్ట్‌ సింబల్‌ను జతచేశారు. ఈ పోస్ట్‌పై వెంకటేష్‌ పెద్ద కూతురు అశ్రితా దగ్గుబాటి, సోనమ్‌ కపూర్‌ భర్త ఆనంద్‌ అహుజా స్పందించారు. ‘నా ఆనందాన్ని ఆపులేకపోతున్నాను’. అని అశ్రితా కామెంట్‌ చేశారు. కాగా అశ్రితా, మిహీకా, సోనమ్‌ కపూర్‌ స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాదే రానా ఇంట్లో పెళ్లి బాజాలు మొగనున్నాయి.

My happy place! 🥰🥰 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement