రానా నిశ్చితార్థం జరిగిపోయిందా? | Daggubati Rana Share Photos With Mihika In Traditional Dress | Sakshi
Sakshi News home page

సంప్రదాయ దుస్తుల్లో రానా-మిహీక: వైరల్‌

May 21 2020 12:10 PM | Updated on May 21 2020 2:55 PM

Daggubati Rana Share Photos With Mihika In Traditional Dress - Sakshi

సోషల్‌ మీడియా వేదికగా తన ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు హీరో దగ్గుబాటి రానా. హైదరాబాద్‌కు చెందిన మిహీక బజాజ్‌ను ప్రేమిస్తున్నానని.. ఆమె ఒకే చెప్పిందని రానా ప్రకటించారు. దీంతో వీరిద్దరికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక రానా తన ప్రేమ విషయం వెల్లడించినప్పట్నుంచి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడా అని అటు అభిమానుల్లో ఇటు టాలీవుడ్‌లో తెగ ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా బుధవారం సాయంత్రం రానా-మిహీకల నిశ్చితార్థం జరిగిందని సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. 
 

అయితే ఇరు కుటుంబాలు రామానాయుడు స్టూడియలో మర్యాదపూర్వకంగా కలుసుకొని నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాల గురించి మాత్రమే చర్చించుకున్నారని వారి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ తాజాగా రానా ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఫోటోలను పరిశీలిస్తే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. రానా-మిహీకలు సంప్రదాయ దుస్తులు ధరించడం, పూలతో డెకరేషన్‌ చేయడం వంటివి చూస్తుంటే నిశ్చితార్థం జరిగిందనే అనుమానం కలుగుతోంది. అంతేకాకుండా ‘ఇక అధికారికంగా’ అంటూ ఫోటోస్‌కు క్యాప్షన్‌ పెట్టడంతో రానా-మిహీకల ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని కొందరు పక్కా క్లారిటీకి వస్తున్నారు. ప్రస్తుతం రానా పోస్ట్‌ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. దీంతో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.    


చదవండి:
కొత్త క్యారెక్టర్‌లో నాని

‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement