‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’

Nani Tweet On RANA Love Matter Viral In Social Media - Sakshi

టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి తన బ్యాచిలర్‌ జీవితానికి పుల్‌స్టాప్‌ పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన మిహీక బజాజ్‌ అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు రానా మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసి.. ఆమె యస్‌ చెప్పిన విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు రానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నేచురల్‌ స్టార్‌ నాని చేసిన సరదా ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 

‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020 లో’ అని సరదాగా పేర్కొంటూ బజాజ్‌ కంపెనీకి సంబంధించిన ఓ పాత ప్రకటన వీడియోను జతచేసి.. ‘జోక్స్‌ పక్కకు పెడితే సూపర్‌ బాబాయ్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ పోస్ట్‌ ఫన్నీగా ఉండటంతో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. మిహీక బజాజ్‌ డ్యూ డ్రాప్‌ పేరిట ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇక రానా ప్రస్తుతం విరాట పర్వం, అరణ్య సినిమాలతో బిజీగా ఉన్నాడు. 

చదవండి:
రానా ప్రేయసి మిహీక వివరాలు ఇవే.. 
ముంబై కాదు... హైదరాబాద్‌లోనే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top