పారితోషికంకాదు.. పార్టనర్‌షిప్‌! | KS Ravikumar to join hands with Sathyaraj | Sakshi
Sakshi News home page

పారితోషికంకాదు.. పార్టనర్‌షిప్‌!

May 26 2020 2:48 AM | Updated on May 26 2020 2:48 AM

KS Ravikumar to join hands with Sathyaraj - Sakshi

కేయస్‌ రవికుమార్, ‌ సత్యరాజ్‌

‘నరసింహా, ముత్తు, దశావతారం, జై సింహా’ వంటి భారీ సినిమాలను డైరెక్ట్‌ చేసిన తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ ఓ చిన్న బడ్జెట్‌ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సత్యరాజ్‌ ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆర్‌బీ చౌదరి నిర్మించనున్న ఈ సినిమా బడ్జెట్‌ 2 కోట్ల వరకూ ఉంటుంది. విశేషమేంటంటే... ఈ సినిమాకు పని చేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరూ పారితోషికం తీసుకోవడంలేదట. ఈ సినిమా బిజినెస్‌ పూర్తయిన తర్వాత వాటా  తీసుకుంటారట.

ఈ సినిమా చిత్రీకరణను 30 రోజుల్లో పూర్తి చేయాలన్నది ప్లాన్‌ అని తెలిసింది. ఇందులో తమిళ నటులు విజయ్‌ సేతుపతి, పార్థిబన్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వగానే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పెద్ద స్టార్స్, డైరెక్టర్స్‌ ఇప్పటికే పార్టనర్‌షిప్‌ మీదే సినిమాలు చేస్తున్నారు. కరోనా తర్వాత చిన్న సినిమాలు కూడా పారితోషికాలు కాకుండా పార్టనర్‌షిప్‌ ప్లాన్‌తో రూపొందుతాయా? యాక్టర్స్, డైరెక్టర్స్‌ పారితోషికం బదులు భాగస్వామ్యం తీసుకుంటారా? వేచి చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement