జనానికి రీచ్ అయింది! : నిర్మాత ‘దిల్’ రాజు | Krishnashtami Movie Success Meet | Sakshi
Sakshi News home page

జనానికి రీచ్ అయింది! : నిర్మాత ‘దిల్’ రాజు

Feb 23 2016 11:01 PM | Updated on Sep 3 2017 6:15 PM

జనానికి రీచ్ అయింది! : నిర్మాత ‘దిల్’ రాజు

జనానికి రీచ్ అయింది! : నిర్మాత ‘దిల్’ రాజు

మా ‘కృష్ణాష్టమి’ మాస్ ఎంటర్‌టైనర్‌గా విజయం అందుకుంది. సునీల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.

‘‘మా ‘కృష్ణాష్టమి’ మాస్ ఎంటర్‌టైనర్‌గా విజయం అందుకుంది. సునీల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మాస్ ఎలిమెంట్స్ జనానికి రీచ్ అయ్యాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సునీల్, నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడేలతో వాసువర్మ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వ హించారు. హీరో సునీల్ మాట్లాడుతూ- ‘‘ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తు న్నారు.
 
  ‘దిల్’ రాజుగారు లేకుంటే ఈ చిత్రం ఉండేది కాదు. ఈ విజయంతో మరిన్ని ప్రయోగాలు చేయవచ్చనే ధీమా వచ్చింది’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల ముఖాల్లో సంతోషం కోసం పడ్డ కష్టం వృథా కాలేదు. వసూళ్లు స్టడీగా ఉన్నాయి’’ అని వాసువర్మ పేర్కొన్నారు. నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడే, సంగీత దర్శకుడు దినేష్ కూడా మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement