వాళ్లే నన్ను మెచ్చుకుంటారు : కీర్తి సురేశ్‌ | Keerthy Suresh Says Even Who Trolls Will Appreciate Me | Sakshi
Sakshi News home page

వాళ్లే నన్ను మెచ్చుకుంటారు : కీర్తి సురేశ్‌

Apr 25 2018 8:02 PM | Updated on Apr 25 2018 8:02 PM

Keerthy Suresh Says Even Who Trolls Will Appreciate Me - Sakshi

కీర్తి సురే్శ్‌ (ఫైల్‌ ఫొటో)

లెజండరీ వ్యక్తుల జీవితం ఆధారంగా తెరకెక్కే సినిమాల్లో నటించే అవకాశం రావాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రస్తుతం ఆ అదృష్టం కీర్తి సురేశ్‌కు దక్కింది. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో ఆమె టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే మహానటి టీజర్‌ కూడా విడుదలైంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ పూర్తిగా లీనమైపోయిందంటూ కొందరు మెచ్చుకొంటుంటే.. మరి కొందరు మాత్రం ఆ పాత్రకు కీర్తి న్యాయం చేయలేక పోయారంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

తనకు సంబంధించి ఇలా మిశ్రమ స్పందన రావడంతో కీర్తి సురేశ్‌ ఒకింత ఉద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ఒక వేడుకలో పాల్గొన్న కీర్తి మాట్లాడుతూ.. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారే సినిమా విడుదలైన తర్వాత మెచ్చుకుంటారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ పాత్ర కోసం కీర్తి ఎంతగానో కష్టపడిందని.. అందుకే ఈ విధంగా స్పందించిందని ఆమె సన్నిహితులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement