పులి మేక కలిసి ఆడే ఆట! | Kambathu Ponnu Song From SANDAKOZHI 2 song release | Sakshi
Sakshi News home page

పులి మేక కలిసి ఆడే ఆట!

Sep 1 2018 4:39 AM | Updated on Sep 1 2018 4:39 AM

Kambathu Ponnu Song From SANDAKOZHI 2 song release - Sakshi

విశాల్‌

గతేడాది విశాల్‌ హీరోగా తమిళంలో నటించిన ‘తుప్పరివాలన్‌’ తెలుగులో ‘డిటెక్టివ్‌’ పేరుతో రిలీజై హిట్‌ సాధించింది. అలాగే ఈ ఏడాది ఆయన నటించిన ‘ఇరంబుదురై’ కూడా తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ సాధించింది. ఇప్పుడు విశాల్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సండై కోళి 2’. లింగుస్వామి దర్శకత్వం వహించారు. కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాలో నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్ర చేశారు. విశాల్‌– లింగుస్వామి కాంబినేషన్‌లోనే 2005లో వచ్చిన ‘పందెం కోడి’ చిత్రానికి ఇది సీక్వెల్‌.

ఇది విశాల్‌ కెరీర్‌లో 25వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్స్‌తో పాటు టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై రూపొందిన ‘పందెం కోడి 2’ చిత్రాన్ని విజయ దశమి సందర్భంగా అక్టోబర్‌ 18న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ‘‘టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ‘ఇది పులి, మేక ఆట కాదు. పులి, మేక కలిసి ఆడే ఆట’, ‘ నేనింకా ఆడుకోవడం మొదలుపెట్టలేదు. అడ్డుకోవడం మాత్రమే మొదలుపెట్టాను’ అనే డైలాగ్స్‌ బాగున్నాయి’’అని సమర్పకులు ‘ఠాగూర్‌’ మధు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement