‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో! | Jr NTR Next Movie With Trivikram Srinivas After RRR | Sakshi
Sakshi News home page

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

Aug 6 2019 8:07 AM | Updated on Aug 6 2019 10:32 AM

Jr NTR Next Movie With Trivikram Srinivas After RRR - Sakshi

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్‌, చారిత్రక వీరుడు కోమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ జరుగుతుండగానే ఎన్టీఆర్ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌పై చర్చ మొదలైంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్‌ నటించిన పలు వాణిజ్య ప్రకటనలను త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేశారు. అందుకే మరోసారి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేసేందుకు ఎన్టీఆర్‌ ఆసక్తిగా ఉన్నాడట. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సినిమాను రూపొందిస్తున్న త్రివిక్రమ్‌, ఆ సినిమా పూర్తయిన వెంటనే తారక్‌తో చేయబోయే సినిమా పనులు ప్రారంభించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement