రష్మిక ఇంటి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం | IT Officials Collect 25 lakhs From Rashmika Mandanna Residence | Sakshi
Sakshi News home page

రష్మిక ఇంటి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం

Jan 17 2020 4:09 PM | Updated on Jan 17 2020 6:35 PM

IT Officials Collect 25 lakhs From Rashmika Mandanna Residence - Sakshi

కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజపేటలో ఉన్న హీరోయిన్‌ రష్మిక మందన్న నివాసంపై గురువారం ఐటీ,ఈడీ అధికారులు సోదాలు చేశారు. లెక్కలోకి రాని రూ. 25 లక్షల్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమ ఇంటిపై దాడి చేసిన ఐటీ అధికారులు ఇంటి కాగితాలను తీసుకెళ్లారని రష్మిక తెలిపారు. కాగా, రష్మిక  ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఈ తనిఖీలు జరిగాయి. ఐటీ సోదాల సమయంలో రష్మిక  షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులను అధికారులు ప్రశ్నించారు. (రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు)

అయితే, ఆమె తల్లిదండ్రులు ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు  సరిగా సమాధానం చెప్పకపోవడంతో అధికారులు ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక రష్మిక బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఆస్తి వివరాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఐటీ సోదాలపై స్పందించిన ఆమె మేనేజర్‌ రష్మికకు సంబంధించిన లావాదేవీలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని ప్రస్తుతం తన తండ్రికి సంబంధించిన లావాదేవీలపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఇక కన్నడ స్టార్‌ అయిన రష్మిక ‘ఛలో’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తాజాగా రష్మిక- మహేష్‌బాబు కలిసి  నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. అలాగే తెలుగు, కన్నడం, తమిళంలో వరుస సినిమాలతో ఈ బ్యూటీ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

చదవండి. ఐటీ సోదాలపై స్పందించిన రష్మిక మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement