రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు

సాక్షి, బెంగళూరు: టాలీవుడ్ నటి రష్మికా మందన్నకు షాక్ తగిలింది. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజపేటలో ఉన్న రష్మిక నివాసంపై గురువారం ఐటీ,ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం 7.30 గంటల సమయంలో రష్మిక అభిమానుల పేరుతో ఇంట్లో ప్రవేశించి ఆమె తండ్రితో పరిచయం చేసుకున్నారు. అంతలోనే సోదాలు మొదలుపెట్టారు. దాడిలో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సినిమాలకు తీసుకుంటున్న పారితోషికం వివరాలను రష్మిక తగ్గించి చూపుతున్నట్లు, పన్ను కూడా సరిగా కట్టలేదని ఐటీ ఆరోపిస్తోంది. విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి