ఫ్యాన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పిన రామ్‌చరణ్‌ భార్య

 Hope u like the teaser : upasana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెగా ఫ్యామిలీ అభిమానులకు రామ్‌చరణ్‌ తేజ భార్య ఉపాసన ధన్యవాదాలు చెప్పారు. చరణ్‌పై వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మర్చిపోలేనివని అన్నారు. రామ్‌చరణ్‌ నటిస్తున్న రంగస్థలం టీజర్‌ బుధవారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి విపరీతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌ కొంతమంది చరణ్‌ వాళ్ల ఇంటి వెలుపల భారీగా బాణాసంచా కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో ఉపాసన పంచుకున్నారు. 'ఈ రోజు మా ఇంటి వెలుపల మిస్టర్‌ సీ ???.. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు గాయ్స్‌. మీకు టీజర్‌ నచ్చిందని అనుకుంటున్నాను' అంటూ ఆమె ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top