థ్రిల్లర్‌కి రెడీ | Gopichand New Movie Launch | Sakshi
Sakshi News home page

థ్రిల్లర్‌కి రెడీ

Dec 23 2018 3:00 AM | Updated on Dec 23 2018 3:00 AM

Gopichand New Movie Launch - Sakshi

అనిల్‌ సుంకర, గోపీచంద్, తిరు

స్పైగా మారి ఏవో రహస్యాలను ఛేదించడానికి రెడీ అవుతున్నారు హీరో గోపీచంద్‌. మరి... ఆ రహస్యాలు ఎవరికి సంబంధించినవి? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. తొలి సన్నివేశానికి ఏషియన్‌ సినిమాస్‌ సునీల్‌ క్లాప్‌ ఇచ్చారు.

ఏకే ఎంటరై్టన్మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించనున్నారు. అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ సహ నిర్మాతలు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెల 18న ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది మేలో సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నారు. వెట్రి పళనిస్వామి ఛాయాగ్రాహకునిగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటల రచయిత.

Advertisement
 
Advertisement
Advertisement