'పంజా' పవర్ చూపిస్తాడట..! | director vishnuvardhan action movie with pawan kalyan | Sakshi
Sakshi News home page

'పంజా' పవర్ చూపిస్తాడట..!

Sep 18 2015 8:14 AM | Updated on Jul 6 2019 3:48 PM

'పంజా' పవర్ చూపిస్తాడట..! - Sakshi

'పంజా' పవర్ చూపిస్తాడట..!

హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా తనకు కథ నచ్చితే సినిమా అంగీకరించే నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనతో ఓ భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో కూడా తిరిగి పనిచేసే సాహసం

హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా తనకు కథ నచ్చితే సినిమా అంగీకరించే నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనతో ఓ భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో కూడా తిరిగి పనిచేసే సాహసం, టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలడు. అందుకే గతంలో తనతో ఓ ఫెయిల్యూర్ సినిమా చేసిన తమిళ దర్శకుడితో మరోసారి కలిసి పనిచేయాలనుకుంటున్నాడు పవర్ స్టార్..

పవన్ కళ్యాణ్ హీరోగా యాక్షన్ బ్యాక్ డ్రాప్లో పంజా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విష్ణువర్థన్. కోలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్గా పేరున్న విష్ణువర్థన్ పవర్ స్టార్ హీరోగా అలాంటి స్టైలిష్ యాక్షన్ డ్రామనే తెరకెక్కించాడు. అయితే  పవన్ సినిమాల్లో రెగ్యులర్ గా ఉండే స్పీడ్, ఈ సినిమాలో లేకపోవటంతో పంజా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో విష్ణువర్థన్ తెలుగు సినిమాలకు గుడ్బై చెప్పేశాడు.

లాంగ్ గ్యాప్ తరువాత ఇప్పుడు మరోసారి విష్ణువర్థన్ తెలుగు సినిమా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే ఈ సారి కూడా తన టాలీవుడ్ ఎంట్రీకి పవన్నే నమ్ముకుంటున్నాడు డైరెక్టర్ విష్ణువర్థన్. పవన్తో ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ఈ డైరెక్టర్. ఇప్పటికే పవర్ స్టార్కు కథ కూడా వినిపించిన విష్ణు ఆ కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. మరి ఈ సారైన తను అనుకున్న సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement