breaking news
panja
-
బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సౌత్ డైరెక్టర్
అజిత్ హీరోగా బిల్లా, ఆరంభం లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విష్ణువర్ధన్. తెలుగు పవన్ కల్యాణ్ హీరోగా పంజా సినిమాను రూపొందించిన ఈ స్టైలిష్ డైరెక్టర్ 20బ్తురువాత సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈ దర్శకుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ నిర్మాణంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ఓ బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు విష్ణు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాతో విష్ణువర్ధన్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
'పంజా' పవర్ చూపిస్తాడట..!
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తనకు కథ నచ్చితే సినిమా అంగీకరించే నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనతో ఓ భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో కూడా తిరిగి పనిచేసే సాహసం, టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలడు. అందుకే గతంలో తనతో ఓ ఫెయిల్యూర్ సినిమా చేసిన తమిళ దర్శకుడితో మరోసారి కలిసి పనిచేయాలనుకుంటున్నాడు పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ హీరోగా యాక్షన్ బ్యాక్ డ్రాప్లో పంజా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విష్ణువర్థన్. కోలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న విష్ణువర్థన్ పవర్ స్టార్ హీరోగా అలాంటి స్టైలిష్ యాక్షన్ డ్రామనే తెరకెక్కించాడు. అయితే పవన్ సినిమాల్లో రెగ్యులర్ గా ఉండే స్పీడ్, ఈ సినిమాలో లేకపోవటంతో పంజా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో విష్ణువర్థన్ తెలుగు సినిమాలకు గుడ్‌బై చెప్పేశాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఇప్పుడు మరోసారి విష్ణువర్థన్ తెలుగు సినిమా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే ఈ సారి కూడా తన టాలీవుడ్ ఎంట్రీకి పవన్నే నమ్ముకుంటున్నాడు డైరెక్టర్ విష్ణువర్థన్. పవన్‌తో ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ఈ డైరెక్టర్. ఇప్పటికే పవర్ స్టార్‌కు కథ కూడా వినిపించిన విష్ణు ఆ కథకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. మరి ఈ సారైన తను అనుకున్న సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. -
పంజా