బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సౌత్‌ డైరెక్టర్‌

Director Vishnuvardhan Debuts In Bollywood - Sakshi

అజిత్‌ హీరోగా బిల్లా, ఆరంభం లాంటి సూపర్‌ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విష్ణువర్ధన్‌. తెలుగు పవన్‌ కల్యాణ్‌ హీరోగా పంజా సినిమాను రూపొందించిన ఈ స్టైలిష్‌ డైరెక్టర్‌ 20బ్తురువాత సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈ దర్శకుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్‌ జోహర్‌ నిర్మాణంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా ఓ బయోపిక్‌‌ను తెరకెక్కించనున్నాడు విష్ణు. కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాతో విష్ణువర్ధన్‌ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top