హీరోల కన్నా ఆమెకే ఎక్కువ..! | Deepika Padukone's Fee For Padmavati | Sakshi
Sakshi News home page

హీరోల కన్నా ఆమెకే ఎక్కువ..!

Jan 31 2017 12:58 PM | Updated on Sep 5 2017 2:34 AM

హీరోల కన్నా ఆమెకే ఎక్కువ..!

హీరోల కన్నా ఆమెకే ఎక్కువ..!

ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా హవా చూపిస్తోంది హాట్ బ్యూటి దీపికా పదుకొనే. బాలీవుడ్తో పాటు హాలీవుడ్ ఎంట్రీతోనూ ఆకట్టుకుంటున్న

ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా హవా చూపిస్తోంది హాట్ బ్యూటి దీపికా పదుకొనే. బాలీవుడ్తో పాటు హాలీవుడ్ ఎంట్రీతోనూ ఆకట్టుకుంటున్న ఈ బ్యూటి పారితోషికం విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీగా పేరున్న బాలీవుడ్లో కూడా తన హవాను ఆదిపత్యాన్ని చూపిస్తోంది దీపిక.

ఇప్పటికే హాలీవుడ్ సినిమా ట్రిపులెక్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దీపిక ప్రస్తుతం వివాదాస్పద చిత్రం పద్మావతిలో టైటిల్ రోల్లో నటిస్తోంది. ఈ భారీ చిత్రంలో నటించేందుకు అదే స్ధాయిలో భారీ పారితోషికం అందుకుంటోంది ఈ బ్యూటి. రణవీర్ సింగ్, షాహిద్ కపూర్లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దీపిక హీరోల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటుందట.

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పద్మావతి సినిమా కోసం దీపిక ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటుదన్న టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తం హీరోయిన్ల రెమ్యూనరేషన్లతో పాటు బాలీవుడ్లో చాలా మంది యంగ్ హీరోల రెమ్యూనరేషన్ల కన్నా చాలా ఎక్కువట. అంతేకాదు పద్మావతి సినిమాలో నటిస్తున్న రణవీర్, షాహిద్ల రెమ్యూనరేషన్ కన్నా దీపికకే ఎక్కువ మొత్తం అందుతుందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement