అడవిలో ఫైట్‌ | Check Out How Salman Khan Tried To Woo Katrina Kaif While Shooting Tiger Zinda Hai In Austria | Sakshi
Sakshi News home page

అడవిలో ఫైట్‌

Dec 7 2017 1:11 AM | Updated on Aug 9 2018 7:28 PM

Check Out How Salman Khan Tried To Woo Katrina Kaif While Shooting Tiger Zinda Hai In Austria - Sakshi

అడవిలో ఫైట్‌ఫారెస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఆమిర్‌ ఖాన్‌. ఆ వెంటనే బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కూడా వెళ్లారు. వాళ్ల తర్వాత ‘దంగల్‌’ ఫేమ్‌ ఫాతిమా సనాషేక్‌ కూడా వెళ్లారు. ‘ముందు మీరు వెళ్లండి.. సల్మాన్‌ ఖాన్‌ కోసం నేను చేయాల్సిన వర్క్‌ కొంచెం ఉంది. తర్వాత వస్తా’ అని అన్నారట కత్రినా కైఫ్‌. ఇంతకీ ఆ అడవి ఎక్కడుందో చెప్పలేదు కదూ! థాయ్‌ల్యాండ్‌ పరిసర ప్రాంతాల్లో. అమిర్, అమితాబ్, కత్రినా, ఫాతిమా సనా షేక్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్థాన్‌’. ‘ధూమ్‌ 3’ చిత్రంతో దర్శకునిగా మారిన విజయ్‌ కృష్ణ ఆచార్య ఈ సిన్మాకు దర్శకుడు.

ఇప్పటికే మాల్టా, ముంబై లొకేషన్స్‌లో రెండు షెడ్యూల్స్‌ని కంప్లీట్‌ చేసిన ఈ చిత్రబృందం థర్డ్‌ షెడ్యూల్‌ కోసం థాయిలాండ్‌ వెళ్లారు. అక్కడ కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్, కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తారట విజయ్‌. అదండీ సంగతి. ఇంతకీ కత్రినా తన మాజీ ప్రేమికుడు సల్మాన్‌ కోసం చేయబోయే వర్క్‌ గురించి తెలుసుకోవాలనుంది కదూ!  అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్, కత్రినా జంటగా రూపొందిన ‘టైగర్‌ జిందా హై’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం కత్రినా థాయిలాండ్‌ వెళ్లలేదు. సల్మాన్‌తో కలసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదీ..మేటర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement