బిగ్‌బాస్‌: ఆ కంటెస్టెంట్‌కు వారానికి 30 లక్షలు | Bharti Singh might take home Rs 50 lakh per week In Bigg Boss 12 | Sakshi
Sakshi News home page

Sep 5 2018 5:56 PM | Updated on Sep 5 2018 5:57 PM

Bharti Singh might take home Rs 50 lakh per week In Bigg Boss 12 - Sakshi

ప్రస్తుతం దేశమంతటా ఎంతో పాపులారిటీ సంపాదించిన బుల్లితెర రియాలిటీ షో 'బిగ్‌బాస్'. ఈ షో హిందీ వర్షన్‌లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 11సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న హిందీ 'బిగ్‌బాస్'..12వ సీజన్ లోకి అడుగుపెట్టింది. మంగళవారం తాజాగా బిగ్‌బాస్‌ 12 సీజన్‌ గోవాలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ షో ప్రారంభానికి ముందే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా షోలో పాల్గొనే కంటెస్టెంట్‌ల వివరాలు, వారి పారితోషకాల గురించి నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది.

ఇప్పటివరకు  హీనా ఖాన్‌, దీపికా కకార్‌లు ఈ రియాల్టీ షోలో అత్యధిక పారితోషికం తీసుకున్న వారిగా రికార్డు సృష్టించారు. అయితే తాజా సీజన్‌లో బాలీవుడ్ నటి, కమెడియన్‌ భారతి సింగ్‌ ఆ రికార్డును తిరగరాశారు. తాజా సీజన్‌లో పాల్గొనే సెలబ్రిటీ జోడి భారతి సింగ్‌- హార్ష్‌ లింబాచియాలు వారానికి ఏకంగా యాభై లక్షలు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. వారు అడిగిన భారీ మొత్తానికి షో నిర్వాహకులు కూడా అంగీకరించారని తెలిసింది. భారతి సింగ్‌కు వారానికి 30 లక్షలకు పైగా, ఆమె భర్త హార్ష్‌కు 15 లక్షలకు పైగా పారితోషికం అందనుంది. ఇప్పటివరకు అత్యధికంగా నటి దీపికా కకార్‌ వారానికి 14-16 లక్షలు, హీనా ఖాన్‌ 7 నుంచి 8 లక్షల పారితోషకం తీసుకున్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement