వైరముత్తు అలాంటివాడే!

AR Rahman's reaction on Vairamuthu allegations, Reihana opens up - Sakshi

కొన్ని రోజులుగా వైరముత్తు తనతో పని చేసేవారి మీద లైంగిక వేధింపులు జరిపాడు అంటూ గాయని చిన్మయి పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆరోపణలకు మద్దతు పలికారు సంగీత దర్శకుడు రెహమాన్‌ సోదరి, సంగీత దర్శకురాలు, నిర్మాత రైహానా. ‘‘వైరముత్తు అలాంటివాడే అన్న విషయం ఇండస్ట్రీలో ఓపెన్‌ సీక్రెట్‌. వైరముత్తు ఇలాంటి వాడు అన్న సంగతి రెహమాన్‌కి తెలియదు. ‘నిజమా? ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి?’ అని రెహమాన్‌ నన్ను అడిగాడు. రెహమాన్‌ పుకార్లను పట్టించుకోడు. తన పనేంటో తను చేసుకుంటూ వెళ్తాడు. అలాగే కాంట్రవర్శీలు ఉన్నవాళ్లతో తను పనిచేయడు. మరి రెహమాన్‌ వీళ్లతో కలసి పనిచేయడా? అంటే.. అది తన ఇష్టం’’ అని పేర్కొన్నారు.

చెడ్డవాడు
హీరోయిన్‌ లేఖా వాషింగ్‌టన్‌ కూడా ‘మీటూ’ అంటూ పేరు చెప్పకుండా ఓ వ్యక్తిని ఆరోపించారు. శింబుతో కలసి లేఖ ‘కెట్టవన్‌’ అనే సినిమాలో యాక్ట్‌ చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ట్వీటర్‌లో ‘ఒకే ఒక్క పదం.. కెట్టవన్‌.. మీటూ’ అని ట్వీట్‌ చేశారు. అంటే.. ఆమె ఎవర్ని అన్నారో ఊహించడం ఈజీ. అన్నట్లు ‘కెట్టవన్‌’ అంటే చెడ్డవాడు అని అర్థం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top