13 ఏళ్ల తరువాత అనుష్క! | Anushka Shetty To Join Sye Raa Narasimha Reddy Shoot Soon | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల తరువాత అనుష్క!

May 5 2019 1:09 PM | Updated on May 5 2019 2:43 PM

Anushka Shetty To Join Sye Raa Narasimha Reddy Shoot Soon - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో ఈ చారిత్రక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లకు చెందిన ప్రముఖ తారలు నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, సుధీప్‌, విజయ్‌ సేతుపతి లాంటి స్టార్స్‌తో పాటు నయనతార, తమన్నా లాంటి గ్లామర్‌ క్వీన్స్‌ కూడా సైరా షూటింగ్‌లో పాల్గొన్నారు.

తాజాగా మరో భామ సైరా టీంతో జాయిన్‌ కానున్నారు. స్టాలిన్‌ సినిమాలో చిరుతో స్పెషల్‌ సాంగ్‌ చేసిన అనుష్క దాదాపు 13 ఏళ్ల తరువాత మరోసారి మెగాస్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేస్తున్నారు. సైరాలో అనుష్క పోర్షన్‌కు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Advertisement
 
Advertisement
Advertisement